ఆసుపత్రిలో వెంటిలేటర్ పై తారకరత్న.. వైరల్ అవుతున్న ఫొటో

  • బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స
  • విషమంగానే ఉన్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి
  • కుటుంబ సభ్యులను కూడా ఐసీయూలోకి అనుమతించని వైద్యులు
Pic of Tarakaratna on ventilator going viral

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో సినీ నటుడు తారకరత్న కుప్పకూలిన సంగతి తెలిసిందే. హుటాహుటిన కుప్పంలోని ఆసుపత్రికి ఆయనను తరలించగా... ఆయన గుండెపోటుకు గురయ్యారని వైద్యులు నిర్ధారించారు. కుప్పంలో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం ఆయనను తరలించారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పైనే ఉండి చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ తో పాటు అత్యాధునిక పరికరాలతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వైద్యుల తాజా బులెటిన్ ప్రకారం ఆయనకు ఎక్మో సపోర్ట్ ఇవ్వడం లేదు. 

మరోవైపు, తారకరత్న పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉన్న పరిస్థితుల్లో... ఆయనను చూసేందుకు ఐసీయూలోకి కుటుంబ సభ్యులను కూడా వైద్యులు అనుమతించడం లేదు. ఇంకోవైపు, తారకరత్న వెంటిలేటర్ పై ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. తారకరత్న త్వరగా కోలుకుని ఇంటికి రావాలని మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News