వేణు మాధవ్ కి కోట్ల ఆస్తి ఉంది .. నేను రెంటు ఇంట్లో ఉంటున్నాను: తల్లి సావిత్రమ్మ

  • వేణు ఎదుగుదలను గురించి ప్రస్తావించిన తల్లి 
  • రెండు నెలలలోపే ఇద్దరు కొడుకులు చనిపోయారని కన్నీళ్లు 
  • వేణు మాధవ్ కి 20 కోట్లకి పైగా ఆస్తులున్నాయని వెల్లడి 
  • అదే తాను చేసిన పొరపాటు అంటూ ఆవేదన  
Venu Madhav Mother Interview

వేణుమాధవ్ .. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కమెడియన్. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన వేణుమాధవ్ స్టార్ కమెడియన్ అనిపించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన వేణుమాధవ్, ఆ తరువాత అనారోగ్య కారణాల వలన చనిపోయారు. వేణుమాధవ్ గురించిన విషయాలను ఆయన తల్లి సావిత్రమ్మ తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 

"నాకు ఇద్దరు ఆడపిల్లలు .. ముగ్గురు మగపిల్లలు. వేణు మాధవ్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు .. మిమిక్రీ బాగా చేసేవాడు. ఒక ప్రోగ్రామ్ లో ఆయనను ఎస్వీ కృష్ణారెడ్డి - అచ్చిరెడ్డిగారు చూసి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అక్కడ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఏ జబ్బు చేసినా మందులు వేసుకునే అలవాటు ఆయనకి లేదు .. అదే కొంపముంచింది" అన్నారు. 

"వేణు మాధవ్ బిజీగా ఉండటం వలన నా ఇద్దరు కొడుకులను కూడా ఆయన దగ్గర అసిస్టెంట్లుగా చేశాను. అదే నేను చేసిన పొరపాటు. కూతురు పెళ్లి టెన్షన్ వలన ఒక కొడుకు చనిపోయాడు. నెలా పదిహేను రోజుల్లో వేణుమాధవ్ చనిపోయాడు. నేను ఎందుకు బతికి ఉన్నానా అనిపిస్తూ ఉంటుంది. వేణుమాధవ్ కి ఏడెనిమిది ఫ్లాట్ లు ఉన్నాయి .. 20 కోట్లకి పైగా ఆస్తులు ఉన్నాయి. నేను మాత్రం మరో కొడుకును చూసుకుంటూ రెంట్ ఇంట్లో ఉంటున్నాను. వేణు మాధవ్ బ్రతికుంటే ఏమైనా ఇచ్చేవాడేమో'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..

More Telugu News