చిరూ క్లాప్ తో మొదలైన నాని 30వ సినిమా!

  • నాని 30వ సినిమా లాంచ్ 
  • చిరూ క్లాప్ తో మొదలైన షూటింగ్ 
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు
  • నాని సరసన నాయికగా మృణాళ్ ఠాకూర్ 
  • తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే కథ
Nani 30 th movie update

నాని 30వ సినిమా కొంతసేపటి క్రితం హైదరాబాదులో లాంఛనంగా మొదలైంది. వెంకట్ మోహన్ .. విజయేందర్ రెడ్డి .. మూర్తి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చిరంజీవి క్లాప్ తో ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి సురేశ్ బాబు, అశ్వనీదత్, దిల్ రాజు, విజయేంద్ర ప్రసాద్, బుచ్చిబాబు, కిశోర్ తిరుమల, వశిష్ఠ, అనంత శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సినిమాలో నాని సరసన నాయికగా మృణాళ్ ఠాకూర్ నటించనుంది. తండ్రీ కూతుళ్ల అనుబంధం చుట్టూ అల్లుకున్న కథ ఇది. వారి ఎమోషన్స్ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

More Telugu News