హన్సిక వివాహ ఫిల్మ్ టీజర్ విడుదల

  • 2022 డిసెంబర్ 4న వివాహంతో ఒక్కటైన హన్సిక, సొహైల్
  • దీన్ని ఓ సినిమా మాదిరిగా చిత్రీకరణ
  • ఫిబ్రవరి 10న డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం
Hansika motwani wedding film teaser out

దక్షిణాది, బాలీవుడ్ నటి హన్సిక మోత్వానీ 2022 డిసెంబర్ 4న సొహైల్ కతూరియాను వివాహం చేసుకోవడం తెలిసిందే. చాలా ఘనంగా, అట్టహాసంగా వివాహ వేడుక నిర్వహించుకున్నారు. దీన్ని ఒక సినిమా మాదిరిగా వారు ప్రత్యేకంగా చిత్రీకరించుకున్నారు. దీనికి సంబంధించి టీజర్ విడుదలైంది. హన్సిక ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఈ టీజర్ ను పోస్ట్ చేశారు. వీరు తమ పెళ్లి సినిమాకి 'లవ్ షాది డ్రామా' అని పేరు పెట్టారు.

సినిమా ప్రోమోలో తన జీవిత భాగస్వామి అయిన సొహైల్ కతూరియా గురించి పెళ్లికి ముందు వచ్చిన వదంతులను హన్సిక తొలగించే ప్రయత్నం చేసింది. పెళ్లికి ముందు సొహైల్ గత సంబంధాలు, మొదటి వివాహం గురించి జరిగిన ప్రచారం తనను ఇబ్బంది పెట్టినట్టు పేర్కొంది. ఈ విషయమై తన తల్లి మోనాతో మాట్లాడగా.. గతాన్ని చూడకంటూ చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. ఇదే విషయమై సొహైల్ తో చర్చించడాన్ని కూడా ప్రోమోలో భాగం చేశారు. వీరి వివాహ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 10న ప్రసారం కానుంది. (సినిమా టీజర్ కోసం)

జైపూర్ లోని ఓ కోటలో వీరి వివాహం ఘనంగా జరగడం తెలిసిందే. నిజానికి సొహైల్ కు ఇది రెండో వివాహం. అంతకుముందు హన్సిక స్నేహితురాలిని సొహైల్ పెళ్లాడాడు. విభేదాలతో వారు విడిపోగా, ఆ తర్వాత హన్సిక, సొహైల్ మధ్య ప్రేమ చిగురించి, అది పెళ్లికి దారితీసింది.

More Telugu News