పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఈటల రాజేందర్

  • కేసీఆర్ వెళ్లగొడితే బీజేపీ తనను అక్కున చేర్చుకుందన్న ఈటల
  • తానేదైనా పార్టీని నమ్ముకుంటే చివరి వరకు అందులోనే ఉంటానని స్పష్టీకరణ
  • పార్టీ మార్పు వార్తలు కేసీఆర్ దుష్ప్రచారమని ఆరోపణ
Etela Rajender Responds Over Party Changing News

తాను పార్టీ మారబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తాను ఏదైనా పార్టీని నమ్ముకుంటే చివరి వరకు అందులోనే కొనసాగుతానని అన్నారు. కేసీఆర్ తనను వెళ్లగొడితే బీజేపీ తనను అక్కున చేర్చుకుని సముచిత స్థానం కల్పించిందన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం కేసీఆర్ చేయిస్తున్నదేనని ఆరోపించారు. 

ఇతర పార్టీల్లో చిచ్చుపెట్టి గెలిచేందుకు ఆయనే ఈ చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈటల అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో సోమవారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News