పార్టీలో అవమానాలను భరించలేను: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి

  • తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ కోటంరెడ్డి ఆగ్రహం
  • తనపై తన తమ్ముడిని రెచ్చగొడుతున్నారంటూ ఆవేదన
  • అవమానం ఉన్నచోట కొనసాగలేనని వ్యాఖ్య
I will quit politics says Kotamreddy

అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తన ఫోన్ నే ట్యాప్ చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనుమానం ఉన్న చోట తాను కొనసాగడం కష్టమని ఆయన అన్నారు. 

తన సోదరుడు గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను ఎన్నికల బరిలో నిలబడనని చెప్పారు. తన తమ్ముడికి పోటీగా తాను నిలబడనని అన్నారు. తన తమ్ముడిని తనపై పోటీకి నిలబడేలా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి కొనసాగితే రాజకీయాలకు గుడ్ బై చెపుతానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై తన మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అవమానాలను భరించలేనని చెప్పారు. కోటంరెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.

More Telugu News