స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా ఏపీ మంత్రి రోజా

  • సాయ్ లో ఐదు రాష్ట్రాల క్రీడల మంత్రులకు స్థానం
  • దక్షిణ భారతదేశం నుంచి రోజాకు అవకాశం
  • సంతోషం వ్యక్తం చేసిన రోజా
AP minister Roja appointed as a member in Sports Authority Of India

ఏపీ క్రీడల శాఖ మంత్రి రోజా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా నియమితులయ్యారు. రోజాతో పాటు మరో నాలుగు రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులకు కూడా సాయ్ సభ్యులుగా అవకాశం లభించింది. సాయ్ లో రోజా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు కార్యదర్శి జతిన్ నర్వాల్ పేర్కొన్నారు. సాయ్ అధ్యక్షుడిగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కొనసాగుతారు. 

సాయ్ లో తనకు సభ్యత్వం లభించడంపై రోజా స్పందించారు. అరుదైన అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మెరుగైన రీతిలో సేవలు అందిస్తానని పేర్కొన్నారు. రోజా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం లో క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు

More Telugu News