కడప జిల్లా గండికోటలో కమలహాసన్ సందడి

  • శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2
  • గండికోటలో తాజా షెడ్యూల్
  • ఆరు రోజుల పాటు ఇక్కడే షూటింగ్
  • కమల్ ను చూసేందుకు తరలివచ్చిన ప్రజలు
Kamal Haasan at Gandikota for his Indian 2 movie shooting

ప్రముఖ నటుడు కమలహాసన్ కడప జిల్లాకు వచ్చారు. ఆయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2లో నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగును కడప జిల్లా జమ్మలమడుగు వద్ద గండికోటలో ఏర్పాటు చేశారు. దాంతో, షూటింగ్ నిమిత్తం కమల్ గండికోట వచ్చారు. 

కమల్ రాకతో అక్కడ భారీ కోలాహలం నెలకొంది. ఆయనను చూసేందుకు సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. షూటింగ్ స్పాట్ వద్ద సందడి వాతావరణం కనిపించింది. తనకోసం వచ్చిన ప్రజలకు కమల్ అభివాదం చేశారు. కాగా, గండికోట వద్ద ఈ చిత్రం 6 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. 

గతంలో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఇండియన్-2 చాలాకాలం క్రితమే ప్రారంభం అయినా, పలు కారణాలతో ఆలస్యం అయింది. కరోనా సంక్షోభం కూడా ప్రభావం చూపింది.

More Telugu News