విజయ్ కు టీడీపీ అండగా ఉంటుంది: పట్టాభి

  • అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందన్న పట్టాభి
  • తప్పుడు కేసులు పెడుతోందని మండిపాటు
  • రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని విమర్శ
TDP will be with Vijay says Pattabhi

వెనుకబడిన వర్గానికి చెందిన బలమైన నేత అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మండిపడ్డారు. అయ్యన్న కుటుంబం ప్రజల కోసం పోరాడుతోందని, అందుకే వారిని వేధింపులకు గురి చేస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని విమర్శించారు. సైకో సీఎంను ఎదుర్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

సీఐడీ విచారణను ఎదుర్కొంటున్న చింతకాయల విజయ్ కు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వీడియో విచారణ జరిపించాలని వైఎస్ అవినాశ్ రెడ్డి కోరుతున్నారని.. కానీ, ఇతరులను మాత్రం వీడియో విచారణ లేకుండా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ సోషల్ మీడియా విభాగానికి ఇన్చార్జ్ గా ఉన్న విజయ్... ప్రభుత్వ అవినీతి కుంభకోణాలను ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతున్నారని... అందుకే అతనిపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు.

More Telugu News