రాజమౌళి చేతుల మీదుగా 'దసరా' సినిమా టీజర్ రిలీజ్!

  • నాని తాజా చిత్రంగా రూపొందిన 'దసరా'
  • రెండోసారి ఆయన జోడీకట్టిన కీర్తి సురేశ్ 
  • దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల పరిచయం
  • ఆసక్తిని రేపుతున్న టీజర్ 
  • మార్చి 30వ తేదీన సినిమా రిలీజ్  
Dasara teaser released

నాని అభిమానులంతా ఆయన 'దసరా' సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథనాయికగా కీర్తి సురేశ్ అందాల సందడి చేయనుంది. 

గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజమౌళి చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. 

సముద్రఖని కీలకమైన పాత్రను పోషిచిన ఈ సినిమాలో, దీక్షిత్ శెట్టి .. సాయికుమార్ .. పూర్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మార్చి 30వ తేదీన తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నాని - కీర్తి సురేశ్ రెండోసారి కలిసి నటించిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

More Telugu News