గవర్నర్ తీరును ప్రజల్లోకి తీసుకెళతామన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి... కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్

  • ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు
  • గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలుపలేదన్న పల్లా
  • ఇలాంటి చరిత్ర గతంలో లేదని వ్యాఖ్యలు
  • కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్న బండి సంజయ్
War of words between Palla Rajeshwar Reddy and Bandi Sanjay

ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పై ధ్వజమెత్తారు. బడ్జెట్ కు ఆమోదం తెలుపకుండా అకృత్యం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలుపని చరిత్ర గతంలో లేదని అన్నారు. గవర్నర్ తీరును ప్రజల్లోకి తీసుకెళతామని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. 

కాగా, పల్లా వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ ను అసెంబ్లీకి ఎందుకు ఆహ్వానించడంలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. గవర్నర్ ప్రసంగం అసెంబ్లీలో ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. అయినా, బడ్జెట్ అనుమతికి ఇంకా సమయం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కావాలనే గవర్నర్ పై వివాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News