అప్పుడు మాత్రం చాలా భయమేసింది: హీరో సందీప్ కిషన్

  • ఫిబ్రవరి 3వ తేదీన 'మైఖేల్' రిలీజ్ 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సందీప్ కిషన్
  • ఆయన సరసన నాయికగా దివ్యాన్ష 
  • రేపు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
Sundeep Kishan Interview

సందీప్ కిషన్ హీరోగా ప్రేక్షకులను పలకరించడానికి 'మైఖేల్' సినిమా రెడీ అవుతోంది. శ్రీవెంటేశ్వర సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాకి, రంజిత్ జయకోడి దర్శకత్వం వహించాడు. దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా అలరించనున్న ఈ సినిమాను, ఫిబ్రవరి 3వ తేదీన విడుదల చేయనున్నారు. 

తాజా ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ మాట్లాడుతూ .. "ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేశారు. అందువలన ఈ కష్టం వృథా కాకూడదు .. అందుకోసం నేను ఎంతైనా కష్టపడాలి అనిపించేది. ఇంతవరకూ ఏ సినిమా కోసం కూడా నేను ఇంత రిస్క్ చేయలేదు .. సినిమా చూస్తే ఈ మాటను మీరు ఒప్పుకుంటారు" అన్నాడు. 

"ఈ సినిమా షూటింగుకు ముందు 94 కేజీలు ఉండేవాడిని. పాత్ర కోసం జిమ్ చేస్తూ 71 కేజీల వరకూ వచ్చేశాను. అప్పుడు నన్ను నేను చూసుకున్నాను. తగ్గవలసిన దానికంటే చాలా ఎక్కువ తగ్గేశానేమోనని భయమేసింది. అప్పటి నుంచి మళ్లీ దార్లో పడటం మొదలెట్టాను" అంటూ చెప్పుకొచ్చాడు. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

More Telugu News