విజయ్–సమంత ఖుషి సినిమా ఆగిపోలేదు.. అప్​డేట్​ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ

  • ఇప్పటికే కొంత షూటింగ్ చేసిన చిత్రబృందం
  • వివిధ కారణాలతో చిత్రీకరణ ఆగిపోయిన వైనం
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని శివ ప్రకటన
Khushi to resume soon says Shiva Nirvana

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ఖుషి. నిన్నుకోరి, మజిలి వంటి హిట్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే కొంత షెడ్యూల్ పూర్తయింది. తొలుత గతేడాది చివర్లోనే విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం.. తర్వాత ఈ వేసవికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, షూటింగ్ ఆగిపోవడంతో  వేసవిలో కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. స‌మంత అనారోగ్యం, లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేరకొండ కొంత గ్యాప్ తీసుకోవడంతో చిత్రం ముందుకెళ్లలేకపోయింది. 

ఇలా షూటింగ్ షెడ్యూల్స్ నిలిచిపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందన్న పుకార్లు మొదలయ్యాయి. ఆ పుకార్లకు దర్శకుడు పుల్ స్టాప్ పెట్టాడు. చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని ట్వీట్ చేశాడు. అంతా అందంగా ఉండబోతోంది అని పేర్కొన్నాడు. తదుపరి షెడ్యూల్ ను హైద‌రాబాద్‌తో పాటు కేర‌ళ‌లో చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. పాన్ ఇండియ‌న్ స్థాయిలో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలో ఖుషి సినిమాను రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది.

More Telugu News