యూపీ సీఎం యోగిని కలిసిన టీమిండియా స్టార్​ క్రికెటర్

  • లక్నోలోని అధికారిక నివాసంలో భేటీ అయిన సూర్యకుమార్
  • స్కై, మిస్టర్ 360 డిగ్రీ అంటూ పొగిడిన యోగి
  • నిన్న రాత్రి రెండో టీ20లో భారత్ ను గెలిపించిన సూర్య
surya kumar yadav meets UP CM Yogi

 నిన్న రాత్రి రెండో టీ20లో భారత్ ను గెలిపించిన సూర్య టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో సమావేశం అయ్యాడు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఆదివారం రాత్రి లక్నోలో రెండో టీ20 మ్యాచ్ జరిగింది. యూపీ సీఎం యోగి స్టేడియానికి వచ్చి మ్యాచ్ వీక్షించారు. ఈ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై గెలిచింది. 

కివీస్ ఇచ్చిన 100 పరుగుల లక్ష్య ఛేదనలో టాపార్డర్ బ్యాటర్లు నిరాశ పరచగా.. సూర్యకుమార్ యాదవ్ అజేయంగా 26 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం లక్నోలోని సీఎం అధికారిక నివాసంలో యోగి ఆదిత్యనాథ్ ను సూర్యకుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. ఈ విషయాన్ని సీఎం యోగి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సూర్యతో దిగిన పొటోను షేర్ చేశారు. 'యంగ్ అండర్ ఎనర్జెటిక్ స్కై, మిస్టర్ 360 డిగ్రీస్ మా అధికారిక నివాసానికి వచ్చారు’ అని ట్వీట్ చేశారు. కాగా, భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 బుధవారం అహ్మదాబాద్ లో జరగనుంది.

More Telugu News