Raviteja: పాప్యులర్ బ్యాండ్ చేతుల మీదుగా రవితేజ ‘రావణాసుర’ స్పెషల్ సాంగ్ లాంచ్

For the first time in history shanti people to release Ravanasura Special Track for a Film
  • ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటన 
  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్
  • ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 
గతేడాది ‘ధమాకా’, ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో మాస్ మహారాజా రవితేజ వరుసగా విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ‘రావణసుర’ ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌ వీడియోకి అద్భుత స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచింది. తాజాగా ఈ చిత్ర బృందం మరో అప్‌డేట్‌ ఇచ్చింది. 

ఈ చిత్రంలోని మొదటి పాటను ఫిబ్రవరి ఐదో తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సంగీతం అందిస్తున్నారు. వీరు స్వరపరిచిన స్పెషల్ ట్రాక్ ను పాప్యులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. వేదాల నుంచి ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ వరకు పెర్ఫామ్ చేసే ఈ బ్యాండ్ కు ప్రపంచ వ్యాప్తంగా చాలా పేరుంది. అలాంటి బ్యాండ్ లైవ్లో పాటను విడుదల చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి అని చిత్ర బృందం తెలిపింది. కాగా, ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటించారు. సుశాంత్  కీలక పాత్ర పోషిస్తున్నారు. రవితేజ, అభిషేక్ నామాతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Raviteja
Ravanasura
hanti people
band
Special Track
song

More Telugu News