Russia: ఉక్రెయిన్ పై దాడికి ముందురోజు పుతిన్ నన్ను బెదిరించాడు: బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్

  • రాకెట్ తో దాడి చేయడానికి ఒక్క నిమిషం చాలన్నడన్న జాన్సన్ 
  • ఉక్రెయిన్ ను నాటో నుంచి దూరంపెట్టే విషయంలో కచ్చితమైన హామీ కోరాడని వెల్లడి
  • ఒకవేళ అలాంటి హామీ ఇవ్వలేకుంటే ఉక్రెయిన్ కు దూరంగా ఉండాలని పుతిన్ సూచించాడన్న జాన్సన్
ex UK PM Boris Johnson says Putin threatened to lob rocket at him

ఉక్రెయిన్ ఆక్రమణకు ముందు రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను హెచ్చరించాడని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తాజాగా వెల్లడించారు. వ్యక్తిగతంగా తనపైకి రాకెట్ ను ప్రయోగించడానికి కేవలం ఒక్క నిమిషం చాలని పుతిన్ బెదిరించినట్లు వివరించారు. ఉక్రెయిన్ పైకి తన సైన్యాన్ని పంపించడానికి ముందు రోజు పుతిన్ తనకు ఫోన్ చేశాడని జాన్సన్ తెలిపారు. తన శత్రువు (ఉక్రెయిన్) కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తే రాకెట్ దాడికి వెనుకాడనని పుతిన్ చెప్పాడన్నారు.

గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడికి దిగిన విషయం తెలిసిందే.. అప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఉక్రెయిన్ కు మద్దతుగా బోరిస్ జాన్సన్ సహా పలు దేశాధినేతలు కీవ్ లో పర్యటించారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీకి ధైర్యం చెప్పేందుకు, అండగా ఉంటామనే భరోసా ఇచ్చేందుకు ఆ దేశానికి వెళ్లారు. అప్పట్లో బ్రిటన్ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ కూడా కీవ్ కు వెళ్లారు. నాటో సభ్య దేశాలలో బ్రిటన్ కీలకమైంది.. ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ కీవ్ లో పర్యటించడంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరిస్ కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడారు.

ఫోన్ కాల్ సంభాషణ.. ( ఓ ప్రముఖ మీడియా సంస్థకు బోరిస్ జాన్సన్ చెప్పిన వివరాల ప్రకారం)

పుతిన్ : బోరిస్.. ఉక్రెయిన్ ను ఇప్పట్లో నాటో కూటమిలో చేర్చుకునే అవకాశం లేదని చెబుతున్నావు. ఇప్పట్లో అంటే ఏంటి.. వివరంగా చెబుతావా?
బోరిస్ : ఇప్పట్లో అంటే.. సమీప భవిష్యత్తులో నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరే అవకాశం లేదు. ఆ విషయం నీకు బాగా తెలుసు కదా!
( పుతిన్ చాలా రిలాక్స్ డ్ గా మాట్లాడారు. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇచ్చే విషయంపై తాను బేరసారాలు ఆడాలని పుతిన్ కోరుకుంటున్నట్లు నాకు అనిపించింది )
పుతిన్ : ఒకవేళ రేపు మేము ఉక్రెయిన్ ను ఆక్రమించుకుంటామని నీకు తెలిస్తే.. యుద్ధాన్ని ఆపేందుకు ఓ బలమైన, నమ్మకమైన హామీ నువ్వు ఇవ్వగలవా? అలాంటి హామీ ఇవ్వలేనపుడు ఉక్రెయిన్ తో అంటకాగడం ఇక చాలించు.

More Telugu News