బాలీవుడ్ తార రాఖీ సావంత్ ఇంట తీవ్ర విషాదం

  • కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న రాఖీ తల్లి జయ
  • ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స
  • కిడ్నీలు, ఊపిరితిత్తులకు వ్యాపించిన క్యాన్సర్
  • చికిత్స పొందుతూ మృతి
Rakhi Sawant mother Jaya Bheda passes away

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కు మాతృవియోగం కలిగింది. రాఖీ సావంత్ తల్లి జయ భేడా అనారోగ్యంతో కన్నుమూశారు. జయ భేడా కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ నెల 28న తుదిశ్వాస విడిచారు. తల్లి చివరిక్షణాల్లో రాఖీ సావంత్ ఆసుపత్రిలోనే ఉన్నారు. 

క్యాన్సర్ వ్యాధి బాగా ముదరడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి. ఇతర అవయవాలకు కూడా క్యాన్సర్ సోకడంతో జయ భేడా మృతి చెందినట్టు తెలుస్తోంది. తల్లి మరణంతో రాఖీ సావంత్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని రాఖీనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

More Telugu News