రెండో టీ20లో టీమిండియా ముందు ఈజీ టార్గెట్

  • లక్నోలో టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 రన్స్
  • 2 వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్
Easy target for Team India in 2nd T20 against New Zealand

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకు పరిమితం చేశారు. లక్నోలో జరుగుతున్న ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 99 పరుగులే చేసింది. 

టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, హార్దిక్ పాండ్యా 1, వాషింగ్టన్ సుందర్ 1, చహల్ 1, కుల్దీప్ యాదవ్ 1, దీపక్ హుడా 1 వికెట్ తీశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. మార్క్ చాప్ మన్ 14, మైకేల్ బ్రేస్వెల్ 14, ఫిన్ అలెన్ 11, డెవాన్ కాన్వే 11 పరుగులు చేశారు. 

ధాటిగా ఆడే గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులకే అవుట్ కాగా, డారిల్ మిచెల్ (8) కూడా అదే బాటలో నడిచాడు.

More Telugu News