లోకేశ్ యువగళం పాదయాత్రకు కర్ణాటక పోలీసులు

  • కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
  • నేడు పాదయాత్రకు మూడో రోజు
  • కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో పాదయాత్ర
  • లోకేశ్ చుట్టూ వలయంగా ఏర్పడి భద్రత కల్పించిన కర్ణాటక పోలీసులు
Karnataka police provides security for Lokesh Yuvagalam Padayatra at border villages

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేశ్ పాదయాత్రకు ఇవాళ మూడో రోజు కాగా,  శాంతిపురం మండలం గ్రామాలకు పాదయాత్ర చేరుకుంది. 

ఇవి కర్ణాటక సరిహద్దుల్లోని గ్రామాలు కావడంతో కర్ణాటక పోలీసులు లోకేశ్ పాదయాత్రకు భారీ భద్రత కల్పించారు. లోకేశ్ చుట్టూ వలయంగా ఏర్పడి పాదయాత్ర సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశారు. కర్ణాటక పోలీసు విభాగానికి చెందిన డీఎస్పీ, రోప్ పార్టీ, కానిస్టేబుళ్లు కుతేగాని గ్రామం వద్దకు చేరుకుని లోకేశ్ పాదయాత్ర భద్రతలో తోడ్పాటు అందించారు. 

అయితే, లోకేశ్ పాదయాత్ర భద్రత ఏర్పాట్లలో ఏపీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని టీడీపీ ఆరోపించింది.

More Telugu News