మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫొటో పంచుకున్న నాగబాబు

  • పుట్టినరోజు జరుపుకుంటున్న అంజనాదేవి
  • నాగబాబు భావోద్వేగభరిత ట్వీట్
  • జీవితాంతం రుణపడి ఉంటామని వెల్లడి
Nagababu shares a photo on his mother birthday

మెగా బ్రదర్ నాగబాబు తమ మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. మా జీవన రేఖ, జీవితం అనే కానుకతో తమను దీవించిన తల్లి జన్మదినాన్ని జరుపుకుంటున్నామని నాగబాబు వెల్లడించారు. నువ్వు మాపై కురిపించిన ప్రేమ, ఆదరణ పట్ల జీవితాంతం రుణపడి ఉంటాం అమ్మా అంటూ నాగబాబు భావోద్వేగభరితంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. ఈ ఫొటోలో అంజనాదేవి, నాగబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, విజయ, మాధవి ఉన్నారు.

More Telugu News