మూడు నెలల నుంచి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆరోపణ
  • ఆ విషయం తనకు ముందే తెలుసని వెల్లడి
  • తన వద్ద మరో ఫోన్ ఉందన్న కోటంరెడ్డి
Kotamreddy sensational allegations

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆరోపించారు. మూడు నెలల నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయం తనకు ముందే తెలుసని, రహస్యాలు మాట్లాడుకునేందుకు మరో ఫోన్ ఉందని, 12 సిమ్ లు కూడా ఉన్నాయని తెలిపారు.

"ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్ ను మీ పెగాసస్ రికార్డు చేయలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా? నిఘా కోసం నా నియోజకవర్గంలో ఒక ఐపీఎస్ అధికారిని ఏర్పాటు చేసుకోండి. క్రికెట్ బెట్టింగ్ కేసులప్పుడు కూడా ఒక ఎస్పీ నాపై నిఘా పెట్టారు" అని కోటంరెడ్డి పేర్కొన్నారు.

More Telugu News