మీ భార్య అత్యంత అందమైన మహిళ అన్న నెటిజన్.. భారత టెన్నిస్ స్టార్ స్పందన వైరల్

  • ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్  డబుల్స్ లో రన్నరప్ గా సానియా మీర్జా, రోహన్  బోపన్న 
  • స్టేడియంలో మ్యాచ్ వీక్షించిన ఇరువురి కుటుంబ సభ్యులు
  • ప్రత్యేక ఆకర్షణగా బోపన్న భార్య సుప్రియ
Fan Calls Rohan Bopanna Wife Most Beautiful WomanTennis Star Responds

ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా, రోహన్ బోపన్న రన్నరప్ గా నిలిచారు. ఫైనల్లో ఈ ఇద్దరూ బ్రెజిల్ క్రీడాకారుల చేతిలో పోరాడి ఓడిపోయారు. ఈ మ్యాచ్ తో సానియా మీర్జా తన గ్రాండ్ స్లామ్ కెరీర్ కు వీడ్కోలు పలికింది. ఈ మ్యాచ్ చూసేందుకు సానియా కుటుంబంతో పాటు రోహన్ బోపన్న భార్య, పిల్లలు కూడా మెల్ బోర్న్కు వచారు. స్టేడియం స్టాండ్స్ లో కూర్చొని మ్యాచ్ వీక్షించారు. నల్ల రంగు డ్రెస్ ధరించిన బోపన్న భార్య సుప్రియ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

అందంగా ఉన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో  చక్కర్లు కొట్టాయి. దాంతో, ఓ నెటిజన్ తను చూసిన అత్యంత అందమైన మహిళ బోపన్న భార్యనే అని ట్వీట్ చేశారు. దీనికి రోహన్ బోపన్న స్పందించారు.  ‘నేను ఒప్పుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుప్రియను ప్రేమించిన రోహన్ 2012లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది.

More Telugu News