దర్శకుడిగా మారిన 30 ఇయర్స్​ పృథ్వీ.. కూతురే హీరోయిన్

  • కొత్త బంగారు ప్రపంచం సినిమా తీసిన పృథ్వీ
  • షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రం
  • గ్లింప్స్ ను విడుదల చేసిన చిత్ర బృందం
30 years prudhvi turns director

హస్య నటుడిగా, ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పృథ్వీరాజ్. ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ’గా పేరు సంపాదించారు. రాజకీయాల కోసం కొంతకాలం బిజీగా ఉన్నా.. తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ఇప్పుడు దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకోవాలని చూస్తున్నారు. పృథ్వీ రాజ్  దర్వకత్వం వహిస్తున్న తొలి చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. చిత్రంలో ఆయన కూతురు శ్రీలు హీరోయిన్ గా నటించడం విశేషం. క్రాంతి కృష్ణ హీరో. 

విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ పిఆర్ క్రియేషన్స్ బ్యానర్‌‌పై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.  షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా చిత్రం గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన పృథ్వీరాజ్ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. 

More Telugu News