ఆగని ‘పఠాన్’ వసూళ్ల పర్వం.. 4 రోజుల్లోనే రూ. 400 కోట్లతో రికార్డు
- ఈ నెల 25న విడుదలైన షారుక్ ఖాన్ చిత్రం
- రోజుకు వంద కోట్లతో దూసుకెళ్తున్న వైనం
- వేగంగా రూ. 400 కోట్లు రాబట్టిన బాలీవుడ్ చిత్రంగా ఘనత
భారత బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే రూ. 200 పైచిలుకు కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపిస్తోంది. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే తొలి వారాంతంలోనే ఈ చిత్రం 500 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం విలన్ పాత్రలో కనిపించాడు.