బెంగాల్ లో మేం అధికారంలోకొస్తే.. మొఘల్, బ్రిటీష్ పేర్లను మారుస్తాం: సువేందు అధికారి

  • మొఘల్స్ ఎంతో మంది హిందువులను చంపారన్న బీజేపీ నేత సువేందు
  • ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశారని ఆరోపణ 
  • వాళ్ల పేర్లతో ఉన్న ప్రాంతాలన్నింటినీ గుర్తించి, మారుస్తామని వెల్లడి
will remove all mughal names if party comes to power bengal bjp leader

పశ్చిమ బెంగాల్ లో తాము అధికారంలోకి వస్తే మొఘల్, బ్రిటిషర్ల పేర్లపై ఉన్న ప్రాంతాల పేర్లను మారుస్తామని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. రాష్ట్రపతి భవన్‌లోని ఐకానిక్ మొఘల్ గార్డెన్స్‌ పేరును ‘అమృత్ ఉద్యాన్’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్ననేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘వాళ్లు (మొఘల్స్) ఎంతో మంది హిందువులను చంపారు. ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశారు. వాళ్ల పేర్లతో ఉన్న ప్రాంతాలను గుర్తిస్తాం. అన్నింటి పేర్లను మారుస్తాం. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే బ్రిటిష్, మొఘల్ పేర్లను తొలగిస్తాం’’ అని చెప్పారు.

75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’గా జరుపుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ లో ఉన్న అన్ని గార్డెన్ లకు కలిపి అమృత్ ఉద్యాన్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు పెట్టారు. జనవరి 31 నుంచి మార్చి 31 దాకా పౌరులను గార్డెన్ లోకి అనుమతించనున్నారు.

More Telugu News