మిల్లెట్స్ తినే వారు ఈ తప్పులకు చోటు ఇవ్వొద్దు..!

  • మిల్లెట్స్ లో చక్కని ఫైబర్, మంచి పోషకాలు
  • నిదానంగా జీర్ణమవుతాయి కనుక కొందరిలో ఇబ్బందులు
  • నీటిలో నానబెట్టి, స్ప్రౌట్ చేసి, పులియబెట్టి తీసుకోవచ్చంటున్న నిపుణులు
Are you eating your millets the right way Nutritionist advises you to avoid these mistakes

మిల్లెట్స్ (సిరి ధాన్యాలు) కు ఇటీవల ప్రచారం వస్తున్నప్పటికీ.. వేలాది సంవత్సరాల నుంచి వీటి వినియోగం ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. తగినంత ఫైబర్, మంచి పోషకాలతో కూడిన మిల్లెట్స్ నేటి జీవనశైలికి అనుకూలం కాబట్టి ఆదరణ పెరుగుతోంది. అందుకే భారత్ అభ్యర్థనతో ఐక్యరాజ్యసమి 2023 సంవత్సరాన్ని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ప్రకటించింది. 


జోవర్, ప్రోసో, పెర్ల్, ఫాక్స్ టెయిల్, ఫింగర్ మిల్లెట్ (రాగి) బ్రౌన్ టాప్ (కొరలు), బార్న్ యార్డ్, లిటిల్ మిల్లెట్ సిరిధాన్యాల కిందకు వస్తాయి. వీటిల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తోపాటు, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి సాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. విటమిన్ ఏ, బీ, ఫాస్ఫరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, నయసిన్, క్యాల్షియం, ఐరన్ వీటి ద్వారా లభిస్తాయి.

కాకపోతే ఈ మిల్లెట్స్ ను ఎలా తీసుకోవాలనే విషయం అందరికీ తెలియడం లేదు. మిల్లెట్స్ లో ఉండే ఫైటిక్ యాసిడ్ యాంటీ న్యూట్రియంట్ గా పనిచేస్తుంది. అంటే పోషకాలు మన శరీరానికి పట్టకుండా అడ్డుకుంటుంది. ఫైబర్ అధికంగా ఉండడం, నిదానంగా జీర్ణం కావడం వల్ల కొందరిలో ఇబ్బంది కలిగించొచ్చు. అందుకని మిల్లెట్స్ ను ఒకే సారి కాకుండా క్రమంగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మిల్లెట్స్ ను వండుకోవడానికి ముందు వాటిని నీటిలో నానబెట్టుకోవాలని చెబుతున్నారు. ఆహార పదార్థాలు అందరికీ ఒకేే విధమైన ఫలితాలను ఇస్తాయని అనుకోవద్దు, కొందరి శరీర తత్వాలు, వారి జన్యు తీరును బట్టి వేర్వేరు ప్రభావాలు చూపిస్తుంటాయి. అలానే, మిల్లెట్స్ వల్ల కొందరికి జీర్ణపరమైన ఇబ్బందులు ఎదురుకావచ్చు. మనం ఎవరికి వారే విభిన్నమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కనుక ఏదైన ఓ ఆహారం ఆరోగ్యకరం అని చెబితే అది అందరికీ వర్తిస్తుందని అనుకోవద్దని అంటున్నారు. ఎవరు ఏమి చెప్పినప్పటికీ.. వాటిని మనం ప్రత్యక్షంగా ఆచరించినప్పుడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఫలితాలు కనిపించినప్పుడే కొనసాగించాలని సూచిస్తున్నారు. 

మిల్లెట్స్ ను నీటిలో నానెబెట్టి ఉడించుకోవడం లేదంటే, వాటిని స్ప్రౌట్ గా మార్చుకోవడం లేదంటే ఫెర్మెంటింగ్ (పులియబెట్టడం) ప్రక్రియ వల్ల ఫైటిక్ యాసిడ్ ప్రభావం తగ్గిపోతుందని చెబుతున్నారు. ముందుగా రాగి, ఫాక్స టెయిల్ మిల్లెట్స్ ను మొదలు పెట్టుకుని.. ఆ తర్వాత జోవర్,బజ్రా తీసుకుని చూడాలని తెలియజేస్తున్నారు. 

More Telugu News