రవితేజ ప్లేస్ లో పవన్ ను ఊహించుకుని ఆ సీన్ చేశాను: చిరంజీవి

  • 'వాల్తేరు వీరయ్య' ఈవెంటులో చిరంజీవి 
  • లక్షమంది సమక్షంలో జరిగిన ఈవెంట్
  • బాబీని అభినందించిన చిరూ 
  • దేవిశ్రీకి మంచి మార్కులు ఇచ్చిన మెగాస్టార్ 
  • చరణ్ ను చూస్తే గర్వంగా ఉందని వెల్లడి  
Waltair Veerayya Success Event

మాస్ యాక్షన్ సినిమాలపై చిరంజీవి మార్క్ అనేది ఒకటి ఉంది. ఈ తరహా సినిమాలలో చిరంజీవి లుంగీ కట్టి .. తలపాగా చుట్టీ .. బీడీ వెలిగించాడంటే వచ్చే రెస్పాన్స్ వేరే ఉంటుంది. అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. మైత్రీ బ్యానర్లో .. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, 10 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ప్రస్తుతం 250 కోట్ల మార్కుకి చేరువలో ఉంది.  

అలాంటి ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను హనుమకొండలో .. అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. " ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడానికి ప్రధానమైన కారకులు ప్రేక్షకులే .. అందుకే అగ్రతాంబూలం వారికే దక్కుతుంది. నేను ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారో .. అలా కనిపించడం వల్లనే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించింది" అని అన్నారు.

"ఇక ఈ సినిమాను బాబీ ముందుగా అనుకున్న బడ్జెట్ లో తీయడం కూడా సక్సెస్ కి మరో కారణమైంది. బాబీ పడిన కష్టమే ఈ రోజున ఆయనను స్టార్ డైరెక్టర్ ను చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటల కారణంగానే నేను రెచ్చిపోయాను. ఈ సినిమాలో నేను .. రవితేజ జీప్ లో వెళ్లే ఎమోషనల్ సీన్ లో నేను గ్లిజరిన్ వాడలేదు. అందుకు కారణం రవితేజలో నేను పవన్ కల్యాణ్ ను చూసుకోవడమే" అని చెప్పారు. 

"ఈ ఫంక్షన్ కి చరణ్ రావడం ఆనందంగా ఉంది. 'ఆర్ ఆర్ ఆర్'లో 'నాటు నాటు' పాట ఆస్కార్ నామినేషన్స్ వరకూ వెళ్లడం .. ఆ పాటలో చరణ్ ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది. తన స్థానంలో నేనే ఉన్నంతగా ఫీలవుతున్నాను. మీ అందరి ప్రోత్సాహం .. మీ విజిల్స్ .. చప్పట్లు ఇలాగే ఉన్నంతవరకూ ఎన్ని వీరయ్యలైనా చేయగలను" అంటూ, ఈ రోజున బర్త్ డే జరుపుకుంటున్న శ్రుతి హాసన్ కి విషెస్ చెప్పించడం కొసమెరుపు.

More Telugu News