మెగాస్టార్ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను: డైరెక్టర్ బాబీ

  • 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ సెలబ్రేషన్స్ లో బాబీ
  • తన తండ్రి విషయంలో మెగాస్టార్ కి కృతజ్ఞతలు 
  • బ్లాక్ బస్టర్ హిట్ కొడతామని ముందుగానే చెప్పారని వ్యాఖ్య
  • అభిమానుల కోసమే మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తున్నారని వెల్లడి  
Waltair Veerayya Success Event

చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని చెబుతూ వచ్చిన బాబీ, ఆయనతో 'వాల్తేరు వీరయ్య' సినిమా చేశాడు. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబడుతూ దూసుకువెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను 'హనుమకొండ'లో నిర్వహించారు. స్పెషల్ గెస్టుగా చరణ్ రాగా, చిరంజీవి చేతుల మీదుగా టీమ్ లోని వాళ్లంతా షీల్డ్స్ అందుకున్నారు. అక్కడి అభిమానులు ఆయనను 'గజమాల'తో సత్కరించారు. 
 
ఈ స్టేజ్ పై బాబీ మాట్లాడుతూ .. " చిరంజీవిగారికి మా ఫాదర్ వీరాభిమాని. మా నాన్న 4 నెలల్లో చనిపోతారని తెలిసి, ఆయనని చిరంజీవిగారు పిలిపించారు. అప్పటికి ఈ సినిమా 30 శాతం షూటింగు మాత్రమే పూర్తయింది. అయినా నేను బ్లాక్ బస్టర్ హిట్ కొడతానని మా నాన్నతో చిరంజీవిగారు చెప్పారు. ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు. అందుకు మెగాస్టార్ కి కృతజ్ఞతలు చెబుతున్నాను" అన్నారు. 

" మెగాస్టార్ నిద్రలేస్తే సినిమాను గురించి .. అభిమానుల గురించి ఆలోచన చేస్తారు. అందువల్లనే ఆ కుటుంబం నుంచి పవర్ స్టార్ వచ్చారు .. రామ్ చరణ్ వచ్చారు. చిరంజీవిగారు నా చేతిపై ముద్దుపెట్టారు. నేను ఎక్కడికి వెళ్లినా అందరూ  ఆ చేయిని తాకుతున్నారు. కొన్ని వందల మంది ఆ చేయిని ముద్దు పెట్టుకున్నారు" అని అనగానే చిరంజీవి నవ్వేశారు.

More Telugu News