అవినాశ్ సీబీఐ విచారణను రికార్డింగ్ చేయాలని శ్రీకాంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు: పయ్యావుల

  • వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు
  • నేడు సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి
  • విచారణ రికార్డింగ్ చేయాలన్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
  • మీకో న్యాయం, మిగతావారికో న్యాయమా? అన్న పయ్యావుల 
Payyavula fires on YCP MLA Srikanth Reddy

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకావడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. అవినాశ్ ను సీబీఐ విచారించే సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనడం సిగ్గుచేటని అన్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాదా? అంతరిక్షం నుంచి ఏమైనా దిగొచ్చారా? అని నిలదీశారు. 

టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసినప్పుడు వైసీపీ నేతలకు ఈ విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల దగ్గరకు వచ్చేసరికి ఈ నొప్పి తెలిసిందా? అంటూ పయ్యావుల విమర్శించారు. ఏపీ పోలీసులకు ఒక రూల్, సీబీఐకి మరో రూలా? వైసీపీ వారికి ఓ న్యాయం, ఇతర పార్టీల వారికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు.

More Telugu News