అన్న తారకరత్న ఆరోగ్యంపై కల్యాణ్ రామ్ ట్వీట్.. వైరల్

  • విషమంగానే తారకరత్న ఆరోగ్యం
  • ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న 10 మంది డాక్టర్ల వైద్య బృందం
  • సోదరుడు త్వరగా కోలుకోవాలని కల్యాణ్ రామ్ ట్వీట్
Nandamuri Kalyan Ram prays for Taraka Ratna recovery

గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉంది. బెంగళూరులోని ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 10 మంది వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. తారకరత్న చికిత్స పొందుతున్న నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయన తల్లిదండ్రులు శాంతి, మోహనకృష్ణ, భార్య అలేఖ్య రెడ్డి, కూతురు నిషిత, బాలకృష్ణ ఉన్నారు. మరోవైపు తన అన్న తారకరత్న గురించి తమ్ముడు, సినీ నటుడు నందమూరి కల్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

More Telugu News