మేమందరం ఓ గ్యాంగ్ .. మా లీడర్ మెగాస్టార్: 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ ఈవెంటులో కోన వెంకట్

  • హనుమకొండలో 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ ఈవెంట్
  • వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
  • 250 కోట్లకి దగ్గరలో వసూళ్లు ఉన్నాయన్న కోన వెంకట్ 
  • ఈ విజయానికి కారకులు మెగాస్టార్ అని వెల్లడి  
Waltair Veerayya Success Event

తెలుగు సినిమా సీనియర్ రైటర్స్ లో కోన వెంకట్ ఒకరు. అనేక హిట్ చిత్రాలకు ఆయన పనిచేశారు. 'వాల్తేరు వీరయ్య' సినిమా స్క్రిప్ట్ పై కూడా బాబీతో కలిసి ఆయన కసరత్తు చేశారు. హనుమకొండలో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో కోన వెంకట్ మాట్లాడారు. "వరంగల్ లో నేను ఫస్టు టైమ్ ఒక సముద్రాన్ని చూస్తున్నాను .. అదే మెగాస్టార్ అభిమాన సముద్రం" అన్నారు. 

"నాకు తెలిసి ఈ సినిమా 250 కోట్ల వసూళ్లకు దగ్గరలో ఉంది. ఈ సినిమా ఇంత మెగా సక్సెస్ కావడానికి కారణం, చిరంజీవి గారిపై బాబీకి ఉన్న అభిమానం .. ఈ ఇద్దరిపై రవితేజకి ఉన్న ప్రేమ. ఇక ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి కారణం చిరంజీవిగారే. ఈ సినిమా కోసం పనిచేసిన మేమంతా గ్యాంగ్ అయితే .. మా గ్యాంగ్ కి లీడరే మెగాస్టార్" అని చెప్పారు. 

" ఈ సినిమా తరువాత బాబీ పేరు టాప్ త్రీ డైరెక్టర్స్ లో ఉంటుంది అని చిరంజీవిగారు చెప్పారు. నాకు తెలిసి బాబీ టాప్ త్రీ ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. ఈ రోజున ఈ సినిమా ఇంతటి సక్సెస్ ను సాధించడానికి కారణం ప్రేక్షకులు. అలాంటి  ప్రేక్షకులందరికీ ఈ విజయం అంకితం" అంటూ ముగించారు..

More Telugu News