Avinash Reddy: ముగిసిన సీబీఐ విచారణ... తెలిసిన విషయాలన్నీ చెప్పానన్న అవినాశ్ రెడ్డి

  • వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
  • దాదాపు 4 గంటల పాటు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన వైనం
  • ఆడియో, వీడియో రికార్డింగ్ కు సీబీఐ అంగీకరించలేదన్న అవినాశ్ 
  • విచారణలో సహకరిస్తానని సీబీఐకి చెప్పినట్టు వెల్లడి
CBI questioning on Avinash Reddy concluded

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిపై సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో అవినాశ్ రెడ్డిని ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని సీబీఐ బృందం 4 గంటల పాటు ప్రశ్నించింది. విచారణ ముగిసిన అనంతరం అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

తనకు తెలిసిన అన్ని విషయాలను సీబీఐ అధికారులకు చెప్పానని వెల్లడించారు. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరానని, కానీ రికార్డింగ్ కు సీబీఐ అధికారులు అంగీకరించలేదని తెలిపారు. 

ఈ కేసుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తానని చెప్పానని అవినాశ్ వివరించారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పారని వెల్లడించారు. విచారణలో సీబీఐకి సహకరిస్తానని స్పష్టం చేశారు.

More Telugu News