Bandi Sanjay: కేసీఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుంది: బండి సంజయ్

  • ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించిన తెలంగాణ సర్కారు
  • తప్పులు సరిదిద్దాలంటూ బీజేవైఎం నేతల ఆందోళన
  • పోలీసుల లాఠీచార్జి
  • బీజేవైఎం తెలంగాణ అధ్యక్షుడు భానుప్రకాశ్ కు గాయాలు!
  • పోలీసులపై మండిపడిన బండి సంజయ్
Bandi Sanjay fires on CM KCR

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల పరీక్షలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ధ్వజమెత్తారు. తప్పులు సరిదిద్దాలని ఆందోళన చేస్తే అమానుషంగా ప్రవర్తిస్తారా? అని మండిపడ్డారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించడం చేతకాని సర్కార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుందని అన్నారు. 

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ బీజేవైఎం నేతలు ఛలో డీజీపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టగా, పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకోగా, బీజేవైఎం తెలంగాణ అధ్యక్షుడు భానుప్రకాశ్ సొమ్మసిల్లిపడిపోయారు. భానుప్రకాశ్ పై పోలీసులు లాఠీచార్జి చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ప్రస్తుతం భానుప్రకాశ్ హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భానుప్రకాశ్ ను బండి సంజయ్ ఫోన్ లో పరామర్శించారు. ఈ సందర్భంగానే బండి సంజయ్ పోలీసుల తీరుపై మండిపడ్డారు.

More Telugu News