Aryna Sabalenka: ఆస్ట్రేలియన్ ఓపెన్: మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త ఛాంపియన్

Aryna Sabalenka wins maiden grand slam by clinching Australian Open womens singles title
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన అరినా సబలెంకా
  • ఫైనల్లో రైబాకినాపై విజయం
  • కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ సాధించిన సబలెంకా
బెలారస్ కు చెందిన ఐదో సీడ్ క్రీడాకారిణి అరినా సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. మెల్బోర్న్ లో నేడు జరిగిన ఫైనల్లో సబలెంకా 4-6, 6-3, 6-4తో 22వ సీడ్ ఎలెనా రైబాకినాపై విజయం సాధించింది. 

తొలి సెట్ లో ఓటమిపాలైనప్పటికీ... ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు చేజిక్కించుకున్న సబలెంకా కెరీర్ లోనే చిరస్మరణీయ విజయం సాధించింది. తొలి సెట్ ను గెలిచినా, తర్వాత అదే ఊపు కనబర్చలేకపోయిన కజకిస్థాన్ అమ్మాయి 23 ఏళ్ల రైబాకినా రన్నరప్ తో సరిపెట్టుకుంది. 

కాగా, 24 ఏళ్ల సబలెంకాకు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడంతో సబలెంకా ప్రపంచ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో రెండోస్థానానికి ఎగబాకింది.
Aryna Sabalenka
Title
Australian Open
Grand Slam
Womens Singles
Champion
Belarus

More Telugu News