జీవో నెం.1ను ఆధారంగా చేసుకుని ఎవరిపైనా నిషేధం విధించడంలేదు: ఏపీ డీజీపీ

  • ఇటీవల జీవో నెం.1 తీసుకువచ్చిన ఏపీ సర్కారు
  • రోడ్లపై సభలు, సమావేశాలకు అనుమతులపై జీవో
  • మండిపడుతున్న విపక్షాలు
  • జీవో వచ్చాక కూడా అనుమతులు ఇస్తున్నామన్న డీజీపీ
AP DGP talks about GO No 1

ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద జీవో నెం.1పై విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో, రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. జీవో నెం.1ను ఆధారంగా చేసుకుని ఎవరిపైనా నిషేధం విధించడం లేదని స్పష్టం చేశారు. జీవో నెం.1 వచ్చాక కూడా పొలిటికల్ మీటింగ్ లకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. ఎవరైనా పాదయాత్ర చేయాలంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అనుమతి తీసుకోవాలని డీజీపీ సూచించారు. 

కాగా, జీవో నెం.1 వ్యవహారం ఇటీవల సుప్రీంకోర్టు వరకు వెళ్లడం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టు విచారిస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఇటీవల వెకేషన్ బెంచ్ ఇచ్చిన సస్పెన్షన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఏపీ హైకోర్టు సీజే బెంచ్... తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

More Telugu News