YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఐదుగురికి సమన్లు జారీ చేసిన సీబీఐ కోర్టు

CBI Court issues notices to 5 accused in YS Vivekananda Reddy murder case
  • హత్య కేసుకు SC/01/2023 నెంబర్ ను కేటాయించిన కోర్టు
  • ప్రధాన, అనుబంధ చార్జ్ షీట్లను స్వీకరించిన కోర్టు
  • ఫిబ్రవరి 10న విచారణకు హాజరుకావాలని నిందితులకు ఆదేశాలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు ప్రారంభించింది. వివేకా హత్య కేసుకు సంబంధించిన ప్రధాన ఛార్జ్ షీట్, అనుబంధ చార్జ్ షీట్ లను విచారణకు స్వీకరించింది. ఐదుగురు నిందితులు ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, శివశంకర్ రెడ్డిలకు సమన్లను జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసుకు SC/01/2023 నెంబర్ ను కేటాయించింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసు విచారణ కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే.
YS Vivekananda Reddy
Murder Case
CBI Court

More Telugu News