దేవుడి గదిలో దిష్టిబొమ్మ .. 'భూతద్దం భాస్కర్ నారాయణ' టీజర్ రిలీజ్!

  • 'భూతద్దం భాస్కర్ నారాయణ'గా శివ కందుకూరి 
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ 
  • కథానాయికగా రాశి సింగ్ 
  • మార్చి 31వ తేదీన సినిమా రిలీజ్  
Bhuthaddam Bhaskar Narayana Teaser Released

శివ కందుకూరి హీరోగా 'భూతద్ధం భాస్కర్ నారాయణ' సినిమా రూపొందింది. స్నేహాల్ .. శశిధర్ .. కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు. 

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. 'చనిపోయిన పదహారు మంది తలలు ఏమైపోయాయన్నది ఎవరికీ తెలియదు. 18 ఏళ్లుగా ఫిర్యాదు చేసినవారు లేరు" అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. ఆ సీరియల్ కిల్లర్ కోసం డిటెక్టివ్ గా హీరో రంగంలోకి దిగుతాడనే విషయం టీజర్ వలన తెలుస్తోంది.

ఈ కేసుకి సంబంధించిన పరిశోధనలో భాగంగా వెళ్లిన హీరో, ఒక ఇంటి దేవుడి గదిలో దిష్టిబొమ్మను చూసి షాక్ అవుతాడు. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? తలలు మాత్రమే అతను ఎందుకు పట్టుకుని వెళుతున్నాడు? అనేదే సస్పెన్స్. రాశి సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమా, మార్చి 31వ తేదీన విడుదల కానుంది.

More Telugu News