బెంగళూరుకు వెళ్లనున్న చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్!

  • నిన్న గుండెపోటుకు గురైన తారకరత్న
  • బెంగళూరు నారాయణ హృదయాలకు తరలింపు
  • తారకరత్నతో పాటు బెంగళూరు వెళ్లిన బాలయ్య
Chandrababu and Junior NTR going to Bengaluru to see Nandamuri Taraka Ratna

నిన్న నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. కుప్పంలోని పేస్ వైద్య కళాశాలలో ఆయనకు చికిత్సను ప్రారంభించి, యాంజియోగ్రామ్ నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిన్న అర్ధరాత్రి ఆయనను బెంగళూరుకు తరలించారు. 

బెంగళూరు నుంచి వచ్చిన రెండు ప్రత్యేక అంబులెన్సుల ద్వారా ఆధునిక వైద్య పరికరాల సపోర్టుతో బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. అంబులెన్సులతో పాటు బాలకృష్ణ కూడా బెంగళూరుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. తారకరత్న భార్య, కుమార్తెలు ప్రస్తుతం బెంగళూరు ఆసుపత్రిలోనే ఉన్నారు. మరోవైపు తారకరత్నను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు బెంగళూరుకు వెళ్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

More Telugu News