Tarakarathna: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్

Junior NTR phone call to Balakrishna to know Tarakarathna health
  • కుప్పంలో గుండెపోటుకు గురైన తారకరత్న
  • కేసీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స
  • అనంతరం పీఈఎస్ ఆసుపత్రికి తరలింపు
  • బాలకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్న ఎన్టీఆర్
నందమూరి తారకరత్న కుప్పంలో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో తారకరత్న పరిస్థితిని బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు. తారకరత్నను ఆసుపత్రికి తరలించడం పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు జూనియర్ ఎన్టీఆర్... బాలయ్యతో చెప్పారు. కాగా, గుండెపోటుకు గురైన తారకరత్నను తొలుత కుప్పంలోని కేసీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం, కుటుంబ సభ్యుల కోరిక మేరకు పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు.
Tarakarathna
Jr NTR
Balakrishna
Kuppam
Yuvagalam

More Telugu News