పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు

  • తన తండ్రినే అవమాన పరిచే పుత్రుడు సమాజానికి అవసరమా? అన్న మంత్రి అంబటి 
  • ఎలుక తోలును 400 రోజులు ఉతికినా తెలుపు రాదని వ్యాఖ్య
  • పాదయాత్ర చేసినోడల్లా నాయకుడు కాలేడని ఎద్దేవా
Ambati Rambabu comments on Nara Lokesh and Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఈరోజు పాదయాత్రను ప్రారంభించిన టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని స్వర్గంలో ఉన్న తన తండ్రినే అవమాన పరిచే పుత్రుడు సమాజానికి అవసరమా?' అని పవన్ ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. నారా లోకేశ్ ను ఉద్దేశస్తూ... 'ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు' అని ఎద్దేవా చేశారు.

More Telugu News