ఎయిర్ టెల్ నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు

  • రూ.489, రూ.509 ధరలతో విడుదల
  • వీటి వ్యాలిడిటీ 30 రోజులు, నెల రోజులు
  • ప్లాన్ వ్యాలిడిటీ వరకు వినియోగించుకోగల బల్క్ డేటా
Airtel launches 2 new prepaid plans for users who browse social media all day

భారతీ ఎయిర్ టెల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. పరిమితి లేకుండా కాల్స్ ప్రయోజనాలు, ఉచిత ఎస్ఎంఎస్ లు, డేటా ప్రయోజనాలతో ఇవి ఉన్నాయి. డేటా ప్లాన్లను కూడా కొత్తగా కొన్నింటిని ప్రకటించింది. 


రూ.489
ఈ ప్లాన్ లో లోకల్, ఎస్టీడీ కాల్స్ పరిమితి లేకుండా మాట్లాడుకోవచ్చు. 300 ఎస్ఎంఎస్ లు ఉచితంగా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. 50జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. డేటా రోజువారీ పరిమితి ఉండదు. 50జీబీ ఉచిత డేటాను కావాలంటే ఒక రోజులోనే లేదంటే 30 రోజుల కాల వ్యవధిలో ఉపయోగించుకోవచ్చు. వింక్ మ్యూజిక్, హెలో ట్యూన్స్ ను ఉచితంగా పొందొచ్చు. ఫాస్టాగ్ పై క్యాష్ బ్యాకర్ ఆఫర్ కూడా ఉంది.

రూ.509 
ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒక నెల. అంటే జనవరి 27న రీచార్జ్ చేసుకుంటే తిరిగి మళ్లీ ఫిబ్రవరి 27న రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అపరిమిత కాలింగ్, 300 ఉచిత ఎస్ఎంఎస్ లు, 60జీబీ బల్క్ డేటా (నెల రోజుల్లో ఎప్పుడైనా వినియోగించుకోగలిగిన) లభిస్తుంది. వింక్ మ్యూజిక్, హెలో ట్యూన్స్ ఉచితం. ముఖ్యంగా గమనించాల్సింది ఈ రెండు ప్లాన్లలోనూ 300 ఉచిత ఎస్ఎంఎస్ లు రోజువారీగా కాదు, ప్లాన్ వ్యాలిడిటీ మొత్తానికి ఇవి ఉచితం.

More Telugu News