'భోళా శంకర్' వాయిదాపడే ఛాన్స్!

  • 'భోళా శంకర్'గా చిరంజీవి
  • కథానాయికగా తమన్నా 
  • హీరోకి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్
  • మే నెలకి వాయిదా వేసే అవకాశం   
Bhola Shankar Movie Update

చిరంజీవి కథానాయకుడిగా 'భోళా శంకర్' రూపొందుతోంది. మెహర్ రమేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా మాస్ యాక్షన్ పాళ్లు ఎక్కువ ఉండేలా చిరంజీవి చూసుకున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. 

చిరంజీవి సరసన నాయికగా తమన్నా .. ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమా ఏకే ఎంటర్టయినమెంట్స్ బ్యానర్లో నిర్మితమవుతోంది. ఇక ఈ సినిమాకంటే ముందుగా ఇదే బ్యానర్లో అఖిల్ హీరోగా 'ఏజెంట్' సినిమా నిర్మితమైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ విషయంలో జాప్యం జరుగుతూ, మొత్తానికి ఏప్రిల్ 14వ తేదీని ఖరారు చేసుకుంది.

ఒకే బ్యానర్లో నిర్మితమైన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవుతాయా? ఏదైనా వాయిదా పడుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. అయితే 'ఏజెంట్' సినిమాను అదే రోజున విడుదల చేసి, మే నెలలో 'భోళా శంకర్' సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.

More Telugu News