తనయుడు నారా లోకేశ్ కు ఆద్ ది బెస్ట్ చెప్పిన చంద్రబాబు!

  • కాసేపట్లో లోకేశ్ పాదయాత్ర ప్రారంభం
  • పసుపుమయంగా మారిన కుప్పం పట్టణం
  • యువత భవిత, రాష్ట్ర భవిష్యత్తు కోసం పాదయాత్ర అన్న చంద్రబాబు
Chandrababu said all the best to Nara Lokesh

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కాసేపట్లో ఆయన పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తన కుమారుడు లోకేశ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. యువత భవిత కోసం... ప్రజల బతుకు కోసం... రాష్ట్ర భవిష్యత్తు కోసం పాదయాత్ర అని ఆయన అన్నారు. మరోవైపు పాదయాత్ర నేపథ్యంలో కుప్పం పట్టణం పసుపుమయం అయింది. పట్టణం మొత్తం టీడీపీ జెండాలు, పాదయాత్ర బ్యానర్లతో నిండిపోయింది. వేలాది మంది టీడీపీ శ్రేణులతో కుప్పం సందడిగా మారింది.

More Telugu News