నారా లోకేశ్ కు తిలకం దిద్దిన మహిళలు.. కాసేపట్లో పాదయాత్ర ప్రారంభం

  • 400 రోజుల పాటు కొనసాగనున్న లోకేశ్ పాదయాత్ర
  • వరదరాజుల స్వామి ఆలయానికి చేరుకున్న లోకేశ్
  • తొలి రోజున 8.5 కిలోమీటర్ల యాత్ర
Lokesh padayatra about to start

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కుప్పం పట్టణం సందడిగా మారింది. కాసేపట్లో లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు మహిళలు తిలకం దిద్ది, అభినందనలు తెలియజేశారు. యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కాసేపటి క్రితం ఆయన వరదరాజుల స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఆయన సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభమవుతుంది. తొలి రోజున ఆయన పాదయాత్ర 8.5 కిలో మీటర్ల మేర కొనసాగనుంది. 

మరోవైపు లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. 'కుప్పం తెలుగుదేశం కుటుంబం ఆత్మీయ స్వాగ‌తానికి ధ‌న్య‌వాదాలు. త‌ర‌గ‌ని మీ అభిమానాన్ని పొందిన నేను అదృష్ట‌వంతుడిని. మీ ఆశీస్సుల‌తో యువగళం పాదయాత్ర మొద‌ల‌వ‌బోతోంది. పాద‌యాత్ర ప్రారంభానికి త‌ర‌లివ‌చ్చిన తెలుగుదేశం పార్టీ పెద్ద‌లు, నేత‌లు, అభిమానులంద‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను' అని అన్నారు. 

ఈ నాటి పాదయాత్ర షెడ్యూల్: 


More Telugu News