కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

  • ఒకప్పుడు భారత్ లో పాప్యులర్ బైకులు యెజ్డీ, జావా
  • కాలక్రమంలో నిలిచిపోయిన ఉత్పత్తి
  • ఇటీవల భారత్ రోడ్లపై పునర్ దర్శనం
Yezdi and Jawa bikes in new colours

రెట్రో బైకులకు సిసలైన ప్రతిరూపాల్లా కనిపించే యెజ్డీ, జావా మోటార్ సైకిళ్లు భారత్ లో ఒకప్పుడు విశేష ప్రజాదరణ పొందాయి. కాలక్రమంలో తెరమరుగైన ఈ రెండు బ్రాండ్లు ఇటీవల మళ్లీ భారత్ లో దర్శనమిస్తున్నాయి. ఐడియల్ జావా సంస్థ ఈ రెండు మోటార్ సైకిళ్లను అప్ డేట్ చేసి జావా 42, యెజ్డీ రోడ్ స్టర్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మునుపటి స్థాయిలో కాకపోయినా, ఈ విలక్షణ బైకులు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి. 

తాజాగా రెండు కొత్త రంగుల్లో జావా 42, యెజ్డీ 42 అందుబాటులోకి వచ్చాయి. జావా 42 సరికొత్తగా కాస్మిక్ కార్బన్ పెయింట్ ఫినిష్ టోన్ లో వస్తుండగా, దీని ధర రూ.1.95 లక్షలు (ఎక్స్ షోరూం) అని తెలుస్తోంది. 

యెజ్డీ రోడ్ స్టర్ డ్యూయల్ టోన్ గ్లాసీ క్రిమ్సన్ ఫినిష్ లో లభ్యమవుతోంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.2.04 లక్షలు. ఈ మోడళ్లలో కేవలం రంగులు మాత్రమే మార్చారు. మెకానిజంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

More Telugu News