అభిమానులకు అభివాదం చేస్తూ వెనక్కి పడిపోయిన బాలకృష్ణ... వీడియో ఇదిగో!

  • హిందూపురంలో బాలయ్య పర్యటన
  • భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
  • ఒక్కసారిగా కదిలిన వాహనం
  • వెనక్కిపడిన బాలకృష్ణను పట్టుకున్న పార్టీ నేతలు
Balakrishna fell down on vehicle

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు హిందూపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ కార్యక్రమంలో వాహనంపై నిలుచున్న బాలకృష్ణ అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, కొద్దిలో ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా వాహనం కదలడంతో ఆయన వెనక్కిపడిపోయారు. అయితే వాహనంపై ఉన్న ఇతర నేతలు ఆయనను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. కాగా, బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా తగిలివచ్చాయి.

More Telugu News