Nara Lokesh: కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద నారా లోకేశ్ కు ఘనస్వాగతం

 Nara Lokesh gets huge welcome at Kuppam guest house
  • రేపటి నుంచి యువగళం పాదయాత్ర
  • కుప్పంలో అడుగుపెట్టిన లోకేశ్
  • లోకేశ్ కు హారతి ఇచ్చి దిష్టి తీసిన మహిళలు
రేపటి నుంచి యువగళం పాదయాత్ర చేపట్టనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పం చేరుకున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద లోకేశ్ కు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మహిళలు లోకేశ్ కు హారతి ఇచ్చి దిష్టి తీశారు. గెస్ట్ హౌస్ వద్ద లోకేశ్ ను కలిసిన టీడీపీ సీనియర్ నేతలు పాదయాత్ర నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు. 

రేపు పాదయాత్రకు తొలిరోజు కాగా, కుప్పంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు 50 వేల మందికి పైగా టీడీపీ కార్యకర్తలు వస్తారని అంచనా. ఈ సభలో వేదికపై 400 మంది నేతలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

కుప్పం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర 3 రోజుల పాటు 29 కిలోమీటర్ల మేర సాగనుంది. కుప్పం తర్వాత పలమనేరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంది. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సాగే ఈ పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాటు లోకేశ్ పాదయాత్ర జరగనుంది. అలాగే, ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించున్నారు.
Nara Lokesh
Yuvagalam
Padayatra
Kuppam
TDP

More Telugu News