Bandi Sanjay: ప్రజల్లోకి వెళ్లి.. మహిళల సమస్యలను తెలుసుకోండి: బండి సంజయ్

Learn about women issues says Bandi Sanjay
  • మహిళా మోర్చా నేతలతో బండి సంజయ్ సమావేశం
  • టీఆర్ఎస్ పాలనలో మహిళల పరిస్థితిపై చర్చ
  • కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని సూచన
తదుపరి ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది బీజేపీనే అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా మోర్చా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలు ఏం కోరుకుంటున్నారు? వారి సమస్యలు ఏమిటనేది తెలుసుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వారికి అందుతున్నాయా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. 

టీఆర్ఎస్ పాలనలో వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకొని, అధ్యయనం చేసి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని అన్నారు. రేషన్ బియ్యం, గ్యాస్ కనెక్షన్లు, ఎరువుల సబ్సిడీ వంటివి కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని... కానీ అన్నీ తానే చేస్తున్నట్టు కేసీఆర్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయంపై ప్రజల్లోకి వెళ్లి వారికి అవగాహన కల్పించాలని చెప్పారు.
Bandi Sanjay
BJP
Mahila Morcha

More Telugu News