Jagan: రాజ్ భవన్ లో ఎట్ హోం... సతీసమేతంగా హాజరైన సీఎం జగన్

CM Jagan attends At Home in Raj Bhavan
షార్ట్స్‌లో చూడండి
భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ అల్పాహార విందు కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. 

ప్రజాప్రతినిధులు, రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ హై టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎట్ హోమ్ కు హాజరైన అతిథులందరినీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుపేరునా పలకరించారు. అటు, గవర్నర్ అర్ధాంగితో సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతి ఉల్లాసంగా కబుర్లు చెబుతూ కనిపించారు. 
Go Back to Shorts
Jagan
At Home
Governor
Raj Bhavannnnnnnnnnn

More Telugu News