గ‌వ‌ర్న‌ర్‌పై మంత్రి త‌ల‌సాని ఫైర్

  • రిపబ్లిక్ డే రోజున రాజకీయ వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్న తలసాని
  • గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కలగజేసుకోవాలని వ్యాఖ్య
  • గవర్నర్ పదవిలో ఉంటూ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం దారుణమని మండిపాటు
Talasani comments on Gov Tamilisai

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం బాధాకరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. గవర్నర్ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలగజేసుకోవాల్సిన అవసరం ఉందని... ఆమెకు లేఖ రాస్తామని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉంటూ... ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని చెప్పారు.

More Telugu News